ముగిసిన రాతిదూలం పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాతిదూలం పోటీలు

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

బనగానపల్లె రూరల్‌ : మండలంలోని నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరిదేవి దేవస్థానంలో జ్యోతి మహోత్సవాల సందర్భంగా రైతు సంబరాల్లో భాగంగా నిర్వహించిన న్యూకేటగిరీ విభాగం ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు బుధవారం ముగిశాయి. పోటీల్లో వరుస స్థానాల్లో బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన ఆర్‌కే బుల్స్‌, తెలంగాణ రాష్ట్రం నాగర్‌ కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన అక్షరరెడ్డి వృషభాలు, అదే జిల్లా రాయవరంకు చెందిన అక్షరరెడ్డి వృషభాలు, నంద్యాల జిల్లా బిల్లలాపురం గ్రామానికి చెందిన గోవర్థన్‌రెడ్డి ఎద్దులు, నంద్యాల జిల్లా చిన్నకానల గ్రామానికి చెందిన చెన్నరెడ్డి వృషభాలు, కోటకందుకురుకు చెందిన నరసింహారెడ్డి ఎద్దులు, సోమయాజులపల్లెకు చెందిన సుబ్బారెడ్డి, నరసయ్యయాదవ్‌ వృషభాలు, రోళ్లపాడుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, గుల్లదుర్తికి చెందిన శశికాంత్‌ వృషభరాజములు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలైన వృషభాల యజమానులకు దాతల సహకారంతో వరుసగా రూ.60వేలు, రూ.50వేలు, రూ.40 వేలు, రూ.30వేలు,రూ.20వేలు,రూ.15వేలు, రూ.10వేలు, రూ.8 వేలతో పాటు జ్ఞాపికను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement