మళ్లీ అక్రమాలు! | - | Sakshi
Sakshi News home page

మళ్లీ అక్రమాలు!

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): వ్యవసాయ శాఖలో గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును ఆశ్రయించిన 106 మందికి న్యాయస్థానం ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీనియారిటీకి పెద్దపీట వేయాలి. రాజకీయ నేతల సిఫార్సులు, ముడుపులకు అవకాశం ఇవ్వరాదు. కానీ వీఏఏల బదిలీల్లో లోలోపల ముడుపుల పర్వం జోరుగా సాగుతోంది. బదిలీల కౌన్సెలింగ్‌ ఈ నెల 26వ తేదీ కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా జరుగుతుంది. నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి కూడా కౌన్సెలింగ్‌ నిర్వహించే కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గతేడాది జూలైలో జరిగిన బదిలీల్లో కర్నూలు, నంద్యాల డీఏఓలు కుమ్మకై ్క సీనియారిటీకి పాతర వేశారు. సిఫార్సు లేఖలు, ముడుపులకు పెద్దపీట వేశారు. సిఫార్సు లేఖ లేకపోతే తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. ఫలితంగా అర్హులు మారుమూల ప్రాంతాలు, కర్ణాటక సరిహద్దు మండలాలకు బదిలీ అయ్యారు. అనర్హులు దగ్గరి మండలాల్లో నియమితులయ్యారు. వీరందరూ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఎక్కడ పనిచేసే వారు అక్కడే కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో పాటు మళ్లీ కౌన్సెలింగ్‌ జరిపి బదిలీలు చేపట్టాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీలు గురువారం చేపట్టనున్నారు.

వీఏఏల బదిలీల్లో మళ్లీ అక్రమాలే..

నిబంధనల మేరకు వీఏఏలను ఖాళీ పోస్టుల్లోనే నియమించాలి. అయితే ముడుపులు దండుకొని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో లీవ్‌ వేకెన్సీల్లో సైతం పోస్టింగ్‌లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులకు.. వీఏఏలకు కర్నూలులో పనిచేసే ఓ ఏఓ మధ్యన ఉండి ముడుపుల బాగోతం నడుపుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కొంత మంది వీఏఏలు మెటర్నటీ లీవ్‌లో ఉన్నారు. మరికొందరు మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. ఇటువంటి ఖాళీల్లో ఎవరినీ నియమించరాదు. కానీ ముడుపుల మహిమ వల్ల ఇటువంటి లీవ్‌లు భర్తీ కానున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లీవ్‌ వేకెన్సీలు భర్తీ చేయడం వల్ల కర్ణాటక సరిహద్దు మండలాలైన కౌతాళం, కోసిగి, హొళగుంద, హలహర్వి, మంత్రాలయం తదితర మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యథావిధిగా ఖాళీలు మిగిలిపోయే పరిస్ధితి ఏర్పడింది. పనిలోపనిగా కొందరు వీఏఏలను మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. మొత్తంగా 2025 జూలైలో జరిగిన అక్రమాల కంటే తాజాగా జరుపుతున్న బదిలీల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్‌, జేసీలు వీఏఏల బదిలీలపై దృష్టి సారించి అక్రమాలను నిరోధించాల్సిన అవసరం ఎంతో ఉంది.

వీఏఏల బదిలీల్లో ముడుపులు,

సిఫార్సులకు పెద్దపీట

లీవ్‌ వేకెన్సీలు కూడా భర్తీకి

రంగం సిద్ధం

కర్ణాటక సరిహద్దు మండలాల్లో

ఖాళీల భర్తీ వట్దిదే

నేడు వీఏఏల బదిలీల

కౌన్సిలింగ్‌ ప్రక్రియ

అబాసుపాలవుతున్న వ్యవసాయ శాఖ

గతేడాది చేపట్టిన మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు, డీడీఏల బదిలీల్లో అబాసుపాలైన వ్యవసాయ శాఖ ప్రస్తుతం గ్రామ స్థాయిలో వీఏఏల బదిలీల్లో సైతం పెద్ద ఎత్తున ముడుపులు దండుకొని అపఖ్యాతిని మూట కట్టుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ అధికారులు, ఏడీఏల బదిలీల్లో రూ.లక్షలు ముడుపులు చేతులు మారాయి. కూటమి పార్టీల నేతలకు బదిలీల పర్వం కాసుల పంట పండించింది. తాజా బదిలీల్లోనూ అక్రమాలదే రాజ్యంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement