జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తాత్కాలిక భవనం | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ కోర్టుకు తాత్కాలిక భవనం

Mar 26 2026 7:35 AM | Updated on Mar 26 2026 7:35 AM

పరిశీలించిన జిల్లా జడ్జి కబర్ధి

బనగానపల్లె రూరల్‌: బనగానపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టు కోసం తాత్కాలికంగా బుధవారం బనగానపల్లె ప్రభుత్వ పశువైద్యశాల భవాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి, జడ్జి ప్రతిమ పరిశీలించారు. బనగానపల్లెలో కోర్టు భవనం నిర్మించి 120 సంవత్సరాలు కావడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో బనగానపల్లెలో అదనంగా మరో కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.9.15 కోట్లు మంజురయ్యాయి. నూతన కోర్టు నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక భవనం కోసం ప్రభుత్వ పశువైద్యశాల భవనాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆర్డీఓ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీడీఓ నాగరాజు, ఆర్‌అండ్‌బీ ఏఈ హుస్సేన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మంజులరెడ్డి, సీనియర్‌ జూనియర్‌ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement