నంద్యాల(న్యూటౌన్): అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎన్నికల హామీలు విస్మరించిన ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు మురళీధర్ అన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలం, సాగు భూమి సాధనకై సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నుంచి మంత్రి ఫరూక్ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సోమన్న, లక్ష్మిదేవి, ధనుంజయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరురూరల్: మండలంలోని కలుగోట్ల పంచాయతీ పరిధిలో మొక్కజొ న్న పొలంలో మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు దాదాపు చేధించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణమని ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం. మృతుడు గోనె గండ్ల మండలం పెద్దనెలటూరి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మంగళవారం మృతుడి కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని గుర్తించి గుండెలు బాధుకుంటూ రోధించారు. హత్యకు గురైన నరేంద్ర అలియాస్ ఏసేబు (30)ను భార్య, అదే గ్రామానికి చెందిన ప్రియుడితో కలిసి ఎమ్మిగనూరులోని ఇంట్లో హత్యచేసి, శవాన్ని పొలం వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై రూరల్ పోలీసులను వివరణ కోర గా హత్యకు గల కారణాలను విచారిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.
ముగిసిన ఎద్దుల పోటీలు
గోస్పాడు: ఉగాదిని పండుగను పురస్కరించుకొని శ్రీవీరభద్రస్వామి, శ్రీ గుమ్మిత మల్లికార్జునస్వామి తిరుణాల సందర్భంగా మండలంలోని దీబగుంట్ల గ్రామంలో పామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, శివలక్ష్మమ్మ, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు మూడురోజు మంగళవారం ముగిశాయి. రాష్ట్రమార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 9 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పాలపండ్ల విభాగంలో పాల్గొన్న ఎద్దులు 15నిమిషాల సమయంలో తమ సత్తా చా టాయి. మొదటి బహుమతి రూ. 50 వేలు నంద్యాల జిల్లా సాంబవరం గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ఎద్దులు, రెండో బహుమతి రూ.30 వేలు బీఎంకేబుల్స్ కర్నూలు జిల్లా వెంకటగిరికి చెందిన శశాంక్‌శ్రయ ఎద్దులు, మూడో బహుమతి రూ. 20 వేలు మార్కాపురం జిల్లా కంభం, సాంబవరం చెందిన వెంకటకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి ఎద్దులు, నాల్గవ బహుమతి రూ. 10 వేలు ప్రకాశం జిల్లా పొట్లపాడుకు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి ఎద్దులు సాధించాయి. వైఎస్సార్సీపీ నాయకులు చిన్ననాగిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, శ్రీశైల నియోజక వర్గ పరిశీలకుడు మదుసూదన్‌రెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


