జడ్జి బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జడ్జి బాధ్యతల స్వీకరణ

Mar 25 2026 7:31 AM | Updated on Mar 25 2026 7:31 AM

● హైకోర్టును ఆశ్రయించిన 106 మంది వీఏఏల సీనియారిటీ జాబితా విడుదల ● అభ్యంతరాలు చెప్పుకునేందుకు నేడు అవకాశం

చాగలమర్రి: ఆళ్లగడ్డ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌గా నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణానికి చెందిన గొడుగు రవికుమార్‌ను నియమిస్తూ అమరావతిలోని హైకోర్టు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్థి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆళ్లగడ్డ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు.

ఒంటిమిట్ట తలంబ్రాల

సమర్పణ

నంద్యాల(వ్యవసాయం): నంద్యాలకు చెందిన మన ఊరు, మనగుడి, మనబాధ్యత సభ్యులు గోటితో ఒలిచిన తలంబ్రాలను మంగళవారం ఒంటిమిట్ట రామాలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివకుమార్‌రెడ్డి, రఘువీర్‌ మాట్లాడుతూ శాసీ్త్రయ పద్ధతుల్లో వడ్లను పండించి వాటిని కొన్ని నెలలుగా మహిళలు భక్తిశ్రద్ధలతో గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యాన్ని ఒంటిమిట్ట రామాలయ అధికారులకు అందజేశామన్నారు. అనంతరం ఆలయంలో జరిగే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజన సేవలో పాల్గొన్నారు.

తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం

గోస్పాడు: పట్టణంలోని విష్ణు ఆసుపత్రిలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం మంగళవారం ప్రత్యేకంగా రక్తదానం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆర్థోఫెడిక్‌ వైద్యులు డాక్టర్‌ వికాస్‌తో పాటు పలువురు వైద్యులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారులకు సహకారం అందించేందుకు ఈనెల 30న ఫండ్‌ రైసింగ్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో రూ.5,560 విలువ గల పరీక్షలు, డాక్టర్స్‌ కన్సల్టేషన్‌ను కేవలం రూ.499కే అందించనున్నట్లు తెలిపారు.

రేపు వీఏఏల బదిలీల కౌన్సెలింగ్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): హైకోర్టు ఆదేశాల మేర కు గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏ) బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26న ఉమ్మడి జిల్లా యూనిట్‌గా వీఏఏల బదిలీల ప్రక్రియను కౌన్సెలింగ్‌ ద్వారా చేపట్టనున్నారు. గతేడాది జూలైలో జరిగిన వీఏఏల బదిలీల్లో అక్రమాలు జరిగాయని, రాజకీయ సిఫార్సు లు, ముడుపులకు పెద్దపీట వేసి అర్హులకు అన్యాయం చేశారని 106 మంది హైకోర్టును ఆశ్రయించారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన హైకోర్టు 106 మంది వీఏఏ బదిలీలను కౌన్సెలింగ్‌ ద్వారా చేపట్టాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ వీఏఏల బదిలీలకు వ్యవసాయ శాఖకు అనుమతి ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా హైకోర్టును ఆశ్రయించిన 106 మంది వీఏఏల సీనియారిటీ జాబితాను జిల్లా వ్యవసాయ శాఖ విడుదల చేసింది. జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రంలోపు రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. 26న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. బదిలీలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీలో కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి కన్వీనర్‌గా, నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి సభ్యుడుగా ఉంటారు. ఇప్పటికై న రాజకీయాలు, ముడుపులకు అతీతంగా బదిలీల కౌన్సెలింగ్‌ జరుగుతుందా అనేది చర్చనీయాంశం అయ్యింది.

కళ్లలో కారం చల్లి

మారణాయుధాలతో దాడులు

కౌతాళం: తెలుగుదేశం నేతలు అక్రమ వ్యాపారాలకు తెరలేపారు. ఇసుక మాఫియా కాడి నుంచి ప్రతి విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఇసుకను తమ గ్రామంలో నుంచి గాకుండా దారి మళ్లించాలని కోరినందుకు మరాణాయుధాలతో దాడి చేసిన ఘటన ఉరుకుంద గ్రామంలో చోటు చేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పర్లను ఉరుకుంద గ్రామం మీద నుంచి గాకుండా దారి మళ్లించాలని తెలుగుదేశం పార్టీలోని తిక్కారెడ్డి వర్గం వారు కోరగా దీనికి మంత్రాలయం ఇన్‌చార్జ్‌ రాఘవేంద్ర రెడ్డి వర్గం ససేమిరా అనింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇరువురుకి గాయాలయ్యాయి. మరాణాయుధాలతో, కళ్లల్లో కారం చల్లి దాడులకు తెగబడ్డారు. ఘటనలో ఇరువర్గాలపై కౌంటర్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement