తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ్గిరాజేసింది. టీడీపీ కోసం శ్రమించిన వారికి కాకుండా వలస నేతలను అందలం ఎక్కించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధ్యక్షుల పేర్లు ఖరారైన తర్వాత స్థానిక నేతల ఒత్తిడితో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై అస | - | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ్గిరాజేసింది. టీడీపీ కోసం శ్రమించిన వారికి కాకుండా వలస నేతలను అందలం ఎక్కించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధ్యక్షుల పేర్లు ఖరారైన తర్వాత స్థానిక నేతల ఒత్తిడితో చివరి నిమిషంలో మార్పులు చేయడంపై అస

Dec 23 2025 7:24 AM | Updated on Dec 23 2025 7:24 AM

తెలుగ

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ

వలసనేతలకు పట్టంపై టీడీపీలో అసంతృప్తి జ్వాల

సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు, నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షులుగా గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితను, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా నాగరాజు యాదవ్‌, ఎన్‌ఎండీ ఫిరోజ్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ ఎంపికపై టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తొలుత కర్నూలు, నంద్యాల అధ్యక్షులుగా కర్నూలు నగర మైనార్టీ నేత వహీద్‌, డోన్‌ అసెంబ్లీ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ ధర్మవరం సుబ్బారెడ్డిలను అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం ఎంపిక చేసినట్లు ఓ జాబితా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో పార్టీ నుంచి తమను అధ్యక్షులుగా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారని, ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన ఉంటుందని తమ అనుచరులతో చెప్పుకు న్నారు. అయితే అధిష్టానం ఆదివారం ప్రకటించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్లు ఒక్కసారిగా పార్టీలో కలకలం రేపాయి. తొలుత నిర్ణయించిన పేర్ల స్థానంలో కొత్త పేర్లకు స్థానం లభించడం ఇది వరకు పేర్లున్న నేతలు, అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ ఇద్దరి ఒత్తిడితోనే ‘అధ్యక్షుల’ మార్పు

కర్నూలు అధ్యక్షుడిగా వహీద్‌ నియామకాన్ని కర్నూలు నియోజకర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఒకరు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కర్నూలు. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీకి చెందిన మైనార్టీ నేతను అధ్యక్షుడిగా నియమిస్తే భవిష్యత్‌లో తమ రాజకీయ ప్రయాణానికి పోటీ అవుతారని ప్రజాప్రతినిధి భావించినట్లు తెలుస్తోంది. దీంతోనే వహీద్‌ను కాదని నాగరాజు యాదవ్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన నాగరాజు యాదవ్‌ను అధ్యక్షుడిగా నియమించేందుకు టీడీపీ అధిష్టానం ససేమిరా అన్నట్లు సమాచారం. చివరకు తిక్కారెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించాలని కూడా భావించినట్లు తెలుస్తోంది. అయితే కులసమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో గుడిసె కృష్ణమ్మ పేరును ఖరారు చేసి, నాగరాజు యాదవ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. టీడీపీలో పథకం ప్రకారమే మైనార్టీ నేతలను ఎదగకుండా కొందరు బడా నేతలు కుట్ర చేస్తున్నారని, ఈ అంశాన్ని ఇప్పటికై నా గ్రహించాలని మైనార్టీల్లో చర్చ జరుగుతోంది. ఓల్ట్‌సిటీలో సోమవారం ఏ టీకొట్టులోనైనా, నలుగురు గుమికూడినా ఇదే అంశంపై చర్చ జరగడం గమనార్హం.

డోన్‌లోనూ అదే ఒత్తిడి

ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు డోన్‌ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేసి టిక్కెట్‌ ఇవ్వలేకపోయాడు. దీంతో సుబ్బారెడ్డిని అధ్యక్షుడిగా, మంత్రి ఫరూక్‌ కుమారుడు ఫిరోజ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని అధిష్టానం భావించింది. అయితే డోన్‌ నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఈ నియామకానికి అడ్డుపడినట్లు తెలుస్తోంది. సుబ్బారెడ్డిని నియమిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని బెదిరించినట్లు సమాచారం. దీంతో అధిష్టానం చివరి నిమిషంలో గౌరు చరితను అధ్యక్షురాలిగా, ఫిరోజ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

పోయాం.. మోసం

ధర్మవరం సుబ్బారెడ్డి

వహీద్‌

భగ్గుమంటున్న అనుచరులు

ధర్మవరం సుబ్బారెడ్డి అనుచరుడు గండికోట రామసుబ్బయ్య ఆదివారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

టీడీపీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని లోకేశ్‌ చెప్పడంతో నమ్మి మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవికి దరఖాస్తు చేశామని, లేదు వలస వచ్చిన వారికే ఇస్తామంటే దరఖాస్తు చేసేవారం కాదన్నారు.

వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రాజా నారాయణ మూర్తి సతీమణి రేణుకకు చైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టారు.

దీనిపై ఎమ్మెల్యే వర్గీయులు నారాయణమూర్తి, సీమ సుధాకర్‌రెడ్డి ఇద్దరూ సోమవారం విలేకరుల సమావేశంలో రామసుబ్బయ్యపై విమర్శలు చేశారు.

మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి, మద్దిలేటిస్వామి ఆలయ చైర్మన్‌ పదవి ఇన్ని రోజులు భర్తీ చేయకుండా అడ్డుపడిందే సుబ్బారెడ్డి అని, ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని విమర్శించారు.

నిజానికి ధర్మవరం సుబ్బారెడ్డికి పదవి రాకుండా ‘కోట్ల’ అడ్డుపడటంతో సుబ్బారెడ్డి సూచనలతోనే రామసుబ్బయ్య తమ అక్కసును వెళ్లగక్కుతున్నారని డోన్‌ టీడీపీలో చర్చించుకుంటున్నారు.

రేణుకతో పాటు గౌరు చరిత, నాగరాజు యాదవ్‌ కూడా టీడీపీకి వలస వచ్చిన నేతలే అని, వలసనేతల ఏలుబడిలో టీడీపీ నేతలు పని చేయాల్సిన దారుణ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనే వాదన వినిపిస్తోంది.

ప్రజల్లో వ్యతిరేకతే కారణం

ఇదిలా ఉండగా తొలుత నిర్ణయించిన నేతలు కాకుండా స్థానిక నేతల ఒత్తిడితో ఏకంగా జిల్లా అధ్యక్షుల నియమాకంలో మార్పు చేయడంపై ఇతర రాజకీయపార్టీల్లోనూ ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. భారీ మెజార్టీతో అధికారంలో ఉన్నప్పటికీ ఒత్తిళ్లకు చంద్రబాబు, లోకేశ్‌ తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ప్రభుత్వ తీరుపై ప్రజా వ్యతిరేకత ఉందనే విషయం వారికి బోధపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో కూడా అంతా బావుందని మనం అనుకుంటున్నాం, కానీ ప్రజలు అలా అనుకోవడం లేదని స్వయంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మాటలను లోతుగా విశ్లేషిస్తే తొలి ఏడాదిన్నరలోనే ప్రజావ్యతిరేకత స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే వాదన వినిపిస్తోంది.

కర్నూలు, నంద్యాల జిల్లాల

అధ్యక్షుల ఎంపికపై కినుక

మొదట తెరపైకి వహీద్‌,

ధర్మవరం సుబ్బారెడ్డి పేర్లు

స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో

ఇద్దరికీ మొండిచేయి

ఊహించని విధంగా

గుడిసె కృష్ణమ్మ, గౌరు చరితకు చోటు

వలస నేతలకు పదవులు

కట్టబెట్టడంపై విమర్శలు

సోషల్‌ మీడియాలో భారీగా ట్రోలింగ్‌

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ1
1/2

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ2
2/2

తెలుగుదేశం పార్టీలో అధ్యక్షుల ఎంపిక ఆ పార్టీ నేతల్లో అగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement