ప్రభుత్వం దృష్టికి గిరిజన ఉద్యోగుల సమస్యలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని గిరిజన ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప అన్నారు. సోమవారం ఎస్‌బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అధికారులు ఎస్టీ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాన్నారు. ఎస్టీ వసతి గృహాలలో గదుల సమస్య, మంచి నీటి సమస్య, మరుగుదొడ్లు వంటి సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
టీడీపీ కార్యక్రమంలా..
ఎస్టీల సమావేశంలా కాకుండా టీడీపీ కార్యక్రమంలా నిర్వహించారని గిరిజన నాయకులు రాజునాయక్, తిరుపాలు నాయక్, విక్రమసింహనాయక్‌లు విమ ర్శించారు. గిరిజన సంఘాల నాయకులను వేదిక పైకి ఆహ్వానించకపోవడంపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్ తీరును తప్పుబడుతూ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేశామన్నారు. ఎస్టీ కమిషన్ సభ్యులు అధికారికంగా జిల్లాకు వస్తే మండల స్థాయి అధికారిని ఒక్కరిని కూడా కార్యక్రమానికి పిలువలేకపోవడం దారుణమన్నారు. ఐటీడీఏ లో జరుగుతున్న కోట్లాది రూపాయల అవినీతి బయ ట పడుతుందేమోనన్న ఉద్దేశంతోనే గిరిజన నాయకులకు సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.


