నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణింపు
నంద్యాల(న్యూటౌన్): క్రీడకారులు నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణిస్తారని ఎస్‌వీయూ రీజి నల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ ప్రియ అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ పాలిటెక్నిక్ క్రీడా మైదానంలో కళాశాల ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా 28వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2025–26 ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మల్‌కుమార్ ప్రియ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో తోడ్పటమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. పోటీల్లో ఏడు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశా ల నుంచి 526 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అన్సర్‌బాషా, జాయింట్ సెక్రటరీ రవికుమార్, పాలిటెక్నిక్ కళాశాల విభాగాధిపతులు రాజేష్, రమణప్రసాద్, రఘునాథరెడ్డి, సురేష్‌బాబు, విద్యా, మార్గరేట్‌లు పాల్గొన్నారు.
వినియోగదారులహక్కులపై అవగాహన
నంద్యాల(వ్యవసాయం): జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం నంద్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కేఎన్‌ఎం పాఠశాల నుంచి ర్యాలీని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవి ప్రారంభించగా.. మెయిన్ బజార్, కల్పనాసెంటర్, గాంధీచౌక్ మీదుగా కొనసాగింది. అనంతరం జిల్లా వినియోగదారుల అధ్యక్షుడు అమీర్‌బాషా అధ్వర్యంలో 8, 9 తరగతి విద్యార్థులకు డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్ధత, సత్వర పరిష్కారం అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాణ్యం మోడల్ స్కూల్ పాణ్యం విద్యార్థులు సుధీర్తి, హారిక, చిన్న వంగళి జెడ్పీ పాఠశాల విద్యార్థిని శ్రీలక్ష్మి, స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థి మాధవి ప్రతిభ చాటి బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అసదుల్లా, న్యాయ నిర్ణేతలు డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేషఫణి, నాగేంద్ర, నీలకంఠమాచారి, తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి హామీ’ని యథావిధిగా కొనసాగించాలి
నంద్యాల(న్యూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వామపక్ష పార్టీల నాయకులు మురళీధర్, బాబాఫకృద్దీన్, లక్ష్మణ్, మహమ్మద్‌గౌస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఈ పథకానికి వీబీజీ రాంజీ అనే పేరు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాల య అధికారి సూర్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు శ్రీనివాసులు, రామచంద్రుడు, నరసింహనాయక్, బాబాఫకృద్దీన్, శ్రీనివాసులు, తోటమద్దులు, వెంకటలింగం, పుల్లా నరసింహ, మౌలాలి, బాలవెంకట్ పాల్గొన్నారు.
నంద్యాల(అర్బన్): ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్ అనంతరం అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో జనవరి 15 నాటికి వంద శాతం ఈ–ఆఫీస్ అమలు చేయాలన్నారు. అలాగే పీ4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించి మార్గదర్శకులను మ్యా పింగ్ చేయాలన్నారు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి కి ఐగాట్ కర్మయోగి వంటి శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు.
నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణింపు
నిరంతర సాధనతోనే క్రీడల్లో రాణింపు


