పోలీసు పీజీఆర్‌ఎస్‌లో 111 వినతులు
నంద్యాల: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన పోలీసు పీజీఆర్‌ఎస్‌లో 111 వినతులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునిల్ షెరాన్ తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని పోలీసుల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ఫిర్యాదుల్లో అధిక శాతం కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలకు సంబంధించినవి ఉన్నాయన్నారు.


