ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు | - | Sakshi
Sakshi News home page

ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు

Nov 11 2025 7:05 AM | Updated on Nov 11 2025 7:05 AM

ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు

ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు

డోన్‌: ఇసుక సిండికేట్‌లో ఆధిపత్య పోరు రోజురోజుకు ముదురుతోంది. ఓ వైపు నియోజకవర్గ ముఖ్యనేతకు కప్పం కడుతూ, మరో వైపు అధికారుల చేతులు తడుపుతూ గుట్టుగా దందా సాగించిన టిప్పర్‌ యజమానుల్లోనే ముసలం పుట్టడంతో పంచాయితీ పోలీసు స్టేషన్‌ చేరుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి, ఈటూరు, బిడుదూరు, పామిడి రీచ్‌ల నుంచి నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి, బేతంచెర్ల, డోన్‌ మండలాల పరిధిలో ఇసుక రవాణా చేసే టిప్పర్‌ యజమానులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. టిప్పర్‌ యజమానులు టన్నుకు రూ.200 అదనంగా అధికార పార్టీ ముఖ్యనేతకు చెల్లించాలని నిర్ణయించారు. పై ప్రాంతాల నుంచి నియోజకవర్గానికి రవాణా అవుతున్న ఇసుక టిప్పర్లకు రాయల్టీ వే బిల్లులు అసలు ఉండటం లేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కొంతమంది టిప్పర్‌ యజమానులు ప్రభుత్వ స్కాన్‌ బిల్లులు కాకుండా మ్యానువల్‌ బిల్లులతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలంగా ఈ ఇసుక దందా కొనసాగుతోంది. అయితే టిప్పర్‌ యజమానుల మధ్య ముసలం పుట్టడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇసుకను నల్లమేకలపల్లెకు చెందిన తమ టిప్పర్లు మాత్రమే రవాణా చేయాలని ఒక వర్గం పట్టుపడుతుండగా.. వేరొక వర్గం ప్యాపిలి, వెంగలాంపల్లె గ్రామాలకు చెందిన టిప్పర్లతో కూడా రవాణా చేసేందుకు సిద్ధపడి సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గానికి ఏమి చేస్తారో చేసుకోండని సవాల్‌ విసురుతున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా అధికార పార్టీలోని ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒక రు ప్యాపిలి, జలదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటుండటంతోనే 30 టన్నుల సామర్థ్యం ఉన్న ఆరు వాహనాలు పోలీసుస్టేషన్‌ల వద్ద ఉంచడం జరిగిందంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇటు పోలీసులు కానీ అటు ఏడీఎంజీ అధికారులు కానీ నోరు మెదిపి వాస్తవాలు వెల్లడించేందుకు సిద్ధపడటం లేదు. దీంతో అధికారపార్టీ నేతల ఇసుక అక్రమ రవాణాపై నియోజకవర్గ ప్రజల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

పట్టుకుంటారు.. వదిలేస్తారు..

ఇసుక సిండికేట్‌ మధ్య పోలీసులు నలిగిపోతున్నారు. రెండు రోజులుగా ఇరువర్గాల నాయకులు పరస్పరం ఫిర్యాదుతో టిప్పర్లను పట్టుకోవడం తర్వాత ముఖ్యనేత ఫోన్‌తో వది లేయడం జరుగుతోంది. ప్యాపిలి మండలం నల్లమేకలపల్లె, వెంగలాంపల్లె గ్రామాలకు చెందిన ఇసుక టిప్పర్లను రెండురోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు ప్యాపిలికి చెందిన మరో అధికార పార్టీ నాయకుడు పోలీసులకు పట్టించారు. ఈ వాహనాలకు బిల్లులు సక్రమంగా లేకపోవడంతో ఏడీఎంజీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన వెంగలాంపల్లె, నల్లమేకలపల్లెకు చెందిన టీడీపీ నాయకులు ప్యాపిలి పట్టణానికి చెందిన మరో టీడీపీ నేతకు చెందిన వాహనాన్ని సోమవారం పోలీసులకు పట్టించారు. అయితే ప్రజాప్రతినిధి ఒత్తిడి మూలంగా పోలీసులు ఈ ఇసుక రవాణా చేసే టిప్పర్‌ యజమాని వద్ద అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయని స్పష్టం చేస్తుంటే, అన్ని సక్రమంగా ఉంటే ఇసుక లోడ్‌తో ఉన్న టిప్పర్‌ను పోలీసుస్టేషన్‌ వద్ద ఎందుకు ఉంచారని సొంత పార్టీ నేతలే పోలీసులను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఇసుక అక్రమ రవాణా దర్జాగా జరుగుతున్నా అడిగేవారు లేరు.

ఇసుకను తామే తరలించాలని

ఒక వర్గం పట్టు

పరస్పరం పోలీసులకు

ఫిర్యాదు చేసుకుంటున్న ఇరువర్గాలు

పోలీసులకు తలనొప్పిగా మారిన వ్యవహారం

నోరుమెదపని ఏడీఎంజీ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement