మూడు ఎకరాల్లో దెబ్బతినింది
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఐదు ఎకరాల సొంత పొలంలో కంది పంట సాగు చేశాను. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలతో కంది పంట నీట మునిగి మూడు ఎకరాల్లో దెబ్బతినడంతో పంటను తొలగించాను. మిగిలిన రెండు ఎకరాలు అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది పది ఎకరాల్లో కంది వేస్తే రబ్బరు పురుగు ఆశించి ఎకరాకు 4 క్వింటాళ్లకు మించి దిగుబడులు రా లేదు. ఆ నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకుందామనుకుంటే మళ్లీ భారీ వర్షాలు పైరును దెబ్బతీశాయి. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం


