చండూరు: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అర్హులైన బాలికలు, మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ రాహుల్ అన్నారు. బుధవారం చండూరు పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వెనుక నూతనంగా నిర్మిస్తున్న కొత్త భవనం పనులను పరిశీలించారు. అనంతరం పీహెచ్సీ డాక్టర్లతో సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఈఓ అంజయ్య, రంజిత్, పీహెచ్సీ వైద్యులు రాజు, సంధ్యాబ్లెస్సీ, సూపర్వైజర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
క్షయవ్యాధి నిర్మూలనకు కృషిచేద్దాం
కనగల్ : క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషిచేద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.రాహుల్ అన్నారు. కనగల్ ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపొద్దన్నారు. అనంతరం ఆయన టీబీ రహిత గ్రామపంచాయతీలుగా మార్చుటకు కృషిచేసిన సర్పంచులను సన్మానించారు. ఎంపీడీఓ ఆవ వేదరక్షిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్షయ నివారణ అధికారి డాక్టర్ రవి ప్రసాద్, ఎంపీఓ పి.సతీష్ కుమార్, డీఈఎంఓ అంజయ్య, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్


