ఐదేళ్లలో 37,626 రపసవాలు | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 37,626 రపసవాలు

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

నల్లగొండ జీజీహెచ్‌లో రికార్డు స్థాయిలో కాన్పులు

నల్లగొండ టౌన్‌: నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులంటే జంకే ప్రజలు, నేడు కార్పొరేట్‌ను తలపించే వైద్య సేవలందుతుండడంతో క్యూ కడుతున్నారు. జీజీహెచ్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌) రికార్డు స్థాయి ప్రసవాలతో అగ్రగామిగా నిలుస్తోంది. గత ఐదేళ్లలో ఇప్పటివరకు ఏకంగా 37,626 డెలివరీలు జరగడం విశేషం.

మెరుగైన వసతులు..

నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని ఎంసీహెచ్‌లో అన్ని రకాల అధునాతన వసతులు అందుబాటులో ఉన్నాయి. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతుండడంతో నిష్ణాతులైన సీనియర్‌ గైనకాలజిస్టులు, ఇతర వైద్య నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక ల్యాబ్‌లు, బ్లడ్‌ బ్యాంక్‌ సౌకర్యం ఉండటంతో కేవలం నల్లగొండే కాకుండా.. మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, మర్రిగూడ, నకిరేకల్‌, హాలియా తదితర ఏరియా ఆస్పత్రుల నుంచి సైతం గర్భిణులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రక్తహీనత, గర్భధారణలో అధిక రక్తపోటు, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, గుండె జబ్బులు, అరుదైన రక్త గ్రూప్‌లు వంటి సంక్లిష్టమైన (హైరిస్కు) కేసులకు కూడా ఇక్కడ విజయవంతంగా చికిత్స అందిస్తున్నారు.

నమోదు నుంచి

పర్యవేక్షణ వరకు పకడ్బందీగా..

గర్భం దాల్చిన మూడో నెలలోనే ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు గర్భిణుల వివరాలను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడంతో పాటు టీకాలు వేయిస్తున్నారు. అత్యవసర సమయాల్లో పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి జీజీహెచ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంసీహెచ్‌ యాప్‌ ద్వారా గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, అందించాల్సిన వైద్య వివరాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నారు. రోగి ఆస్పత్రికి చేరేలోపే వైద్యులు అప్రమత్తమై మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒకవేళ పరిస్థితి మరింత విషమిస్తే, హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి, అక్కడి నోడల్‌ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు.

ఓపీ, ఐపీ, డెలీవరీల వివరాలు ఇలా.. (సెప్టెంబర్‌ వరకు) సంవత్సరం ఓపీ ఐపీ డెలీవరీలు

2022 19,716 8,021 7,546

2023 46,770 8,628 7,377

2024 37,891 8,080 7,347

2025 28,038 7,182 5,841

2026 25,083 6,224 4,846

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement