గుర్రంపోడు : విద్యుత్ కోతలకు నిరసనగా గుర్రంపోడు మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. అదేవిధంగా నల్లగొండ– దేవరకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. లోవోల్టేజీ సమస్య నెలకొందని, వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చినా సబ్స్టేషన్లను తనిఖీ చేసి లాగ్ బుక్‌లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు సబ్స్టేషన్లను పరిశీలించాలన్నారు. ఏఎమ్మార్పీ కాల్వల ద్వారా చెరువులు నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. . కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, పాశం గోపాల్‌రెడ్డి, కేవీ రామారావు, మండల నాయకులు మునుకుంట్ల రాజేష్ రెడ్డి, వడిత్య నాగరాజు, జీఎల్ఎన్ రెడ్డి, జాల మల్లేషం, కుర్మారెడ్డి, పోలె రామచంద్రం, కుంభం ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ కోటిరెడ్డి


