ఎమ్మెల్సీ ఎన్నికకు కోఆర్డినేటర్లు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికకు కోఆర్డినేటర్లు

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

సాక్షి ప్రతినిఽధి, నల్లగొండ : వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పట్టభద్రుల ఓటర్ల నమోదుతో పాటు ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. నియమితులైన వారంతా తమ పరిధిలోని జిల్లాల్లో సంబంధిత నాయకుల సమన్వయంతో పట్టభద్రుల ఓటర్ల నమోదు, ప్రచార కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో అర్హులకు అవగాహన కల్పించడం, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవడం, నమోదు కార్యక్రమం సమర్థవంతంగా సాగేలా పర్యవేక్షించడం వంటి బాధ్యతలను కోఆర్డినేటర్లు చూస్తారు. దాంతో పాటు క్షేత్ర స్థాయిలో అవసరమైన ప్రచార కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ బాధ్యతలను పీసీసీ అప్పగించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించారు.

12 మందికి బాధ్యతలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులు, ఎమ్మెల్యేలను, మరొక చోట అభ్యర్థిని కోఆర్డినేటర్లుగా నియమించింది. నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, హుజూర్‌నగర్‌కు మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నకిరేకల్‌కు వేముల వీరేశం, కోదాడకు నలమాద పద్మావతిరెడ్డి, తుంగతుర్తికి మందుల సామేల్‌, భువనగిరికి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మునుగోడుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నాగార్జునసాగర్‌కు కుందూరు జైవీర్‌రెడ్డి, ఆలేరుకు బీర్ల ఐలయ్య, మిర్యాలగూడకు బత్తుల లక్ష్మారెడ్డి, దేవరకొండకు నేనావత్‌ బాలునాయక్‌, సూర్యాపేటకు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని నియమించింది.

ఫ నియోజకవర్గాల వారీగా నియమించిన పీసీసీ

ఫ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement