రామగిరి(నల్లగొండ) : తెలంగాణ 31వ ఎన్‌సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో నల్లగొండ గంధంవారిగూడెంలో నిర్వహిస్తున్న 12వ వార్షిక శిబిరం మూడో రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రథమ చికిత్స, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ రీసోర్స్ పర్సన్ డాక్టర్ సృజన హాజరై అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అందించాల్సిన ప్రాథమిక వైద్య సహాయంపై వివరించారు. కార్యక్రమంలో క్యాంపు కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ జేమ్స్ శామ్యూల్, అసిస్టెంట్ క్యాంపు కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ శశిధర్‌రావు, సుబేదార్ మేజర్ మాధవరాజు, కెప్టెన్ వక్రమ్‌బాబు, లెఫ్టినెంట్ చిలుముల సుధాకర్, సుబేదార్ కొమ్ము మల్లయ్య, ఏఎన్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.


