108 అంబులెన్స్‌ సేవల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

108 అంబులెన్స్‌ సేవల పరిశీలన

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

నల్లగొండ టౌన్‌ : నల్లగొండలో 108 అంబులెన్స్‌ సేవలను ఢిల్లీ జాతీయ నాణ్యత బృందం సోమవారం పరిశీలించింది. 108 అంబులెన్స్‌ల అత్యవసర వైద్య సేవలు, నాణ్యతను తనిఖీ చేసింది. అంబులెన్స్‌ పరిస్థితి, ప్రాణాలను కాపాడే మందులు, పరికరాలు, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌, అత్యవసర మెడిసిన్‌ కిట్‌ లభ్యత, సిబ్బంది సామర్థ్యం, రెస్పాన్స్‌ టైం, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, బయో మెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ, చేతుల శుభ్రత, అంబులెన్స్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ విధానంపై వివరాలు తెలుసుకుంది. జిల్లాలోని అన్ని 108 అంబులెన్స్‌ లు 24 గంటలూ ఉచిత అత్యవసర సేవలు అందిస్తూ, సగటు రెస్పాన్స్‌ టైం 20 నిమిషాలలోపు ఉండేలా చూస్తున్నామని108 జిల్లా మేనేజర్‌ ఢిల్లీ బృందానికి వివరించారు. 108 సేవలనూ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.

నీలగిరిలో వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధుల పర్యటన

నల్లగొండ టూటౌన్‌ : వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధి బృందం సోమవారం నీలగిరి నగరంలో పర్యటించింది. నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిపాధించిన పెద్ద గడియారం జంక్షన్‌ అభివృద్ధి ప్రాజెక్టును బృందం ప్రతినిధులు పరిశీలించారు. గడియారం సెంటర్‌ పక్కన నిర్మించబోయే వాణిజ్య సముదాయం, స్కైవాక్‌, అర్బన్‌ ప్లాజా, రీచార్జ్‌వెల్స్‌ తదితర అభివృద్ధి పనులపై మేయర్‌ బుర్రి చైతన్య, డిప్యూటి మేయర్‌ అష్రఫ్‌ అలీ అమేర్‌తో చర్చించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, భూసంబంధిత అంశాలు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ, నిర్మాణం సమయంలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, ఫిర్యాదులు, పరిష్కార విధానాలపై వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులు పలు సూచనలు చేశారు. వారి వెంట కార్పొరేషన్‌ కమిషనర్‌ బి.వంశీకృష్ణ, ఈఈ మనోహర, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, డీఈ అశోక్‌, ఏఈ దిలీప్‌భార్గవ్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

శివాలయంలో విశేష పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి కొండపైన అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారికి సోమవారం పూజారులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయమే గర్భాలయంలోని మహా శివుడికి, ముఖ మండపంలోని స్పటిక రామలింగేశ్వరస్వామికి శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వ పత్రాలతో అర్చన చేశారు. సాయంత్రం శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి సేవను ఊరేగించారు. ఇక శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ప్రధానాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంకర్యాలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement