సాగర్‌లో విద్యుదుత్పత్తికి బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

సాగర్‌లో విద్యుదుత్పత్తికి బ్రేక్‌

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

సాగర్‌ జల విద్యుత్‌ ఉత్పత్తి వివరాలు (మి.యూ)

సంవత్సరం లక్ష్యం ఉత్పత్తి

2020–21 1248 2262.68

2021–22 1535 2262.62

2022–23 1500 2355.63

2023–24 1400 540.83

2024–25 1400 1922

2025–26 1459 2572.04

2026–27 1500 425.92

(అక్టోబర్‌ 9 వరకు)

నాగార్జునసాగర్‌: ఎలినినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటు చేయడం.. ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరకపోవడంతో నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటి లభ్యత తగ్గి విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా వర్షాకాలంలో కళకళలాడాల్సిన సాగర్‌ జలాశయం ఈసారి ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి ఆశాజనకంగా లేదు. నీటికొరత కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి కోసం రివర్స్‌ పంపులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. జలవిద్యుత్‌ కేంద్రంలో ఈ ఏడాది విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. వర్షాలు కురసి ఎగువ నుంచి వరద ప్రవాహాలు వచ్చి జలాశయంలో నీటిమట్టం పెరిగితేనే టర్బైన్ల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. జలాశయంలో నీరు లేనందున ఇప్పటి వరకు కేవలం 425.92 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వార్షిక లక్ష్యం1,500 మిలియన్‌ యూనిట్లుగా ఉండగా ఇప్పటి వరకు సాధించిన ఉత్పత్తి దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. గత ఏడాది మాత్రం లక్ష్యానికి మించి విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది.

ఎడమ కాల్వపై ఆగిన ఉత్పత్తి

ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ.. విద్యుత్‌ ఉత్పత్తి కేంఽద్రం ద్వారా నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. జలాశయంలో తగినంత నీటిమట్టం ఉంటేనే నీటి వత్తిడితో టర్బైన్లు తిరిగి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 540 అడుగులకు మించి పెరగకపోవడంతో ప్రధాన విద్యుత్‌ ఉత్పాదన జరగడం లేదు. ఎడమ కాల్వకు నీటి అవసరాల మేరకు నేరుగా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి జలాశయంలో నీటి నిల్వలు పెరిగితేనే మళ్లీ విద్యుదుత్పత్తి ఊపందకు కునే అవకాశముంది.

ఫ ఈ వర్షాకాలంలో

జలవిద్యుత్‌ ఉత్పత్తి అంతంతే..

ఫ వరద జలాలు రాక..

రివర్స్‌ పంపులపైనే ఆధారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement