మునుగోడు : తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. ఆదివారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదని, అందరి బతుకుల్లో వెలుగునింపే పండుగ అన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడి మహిళల్లో ఉత్సాహం నింపారు. దాండియా కళాకారుల ఆట పాటలు అందరిని అలరించాయి.


