నేడు సాగర్‌లో జర్నలిస్టులకు వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు సాగర్‌లో జర్నలిస్టులకు వర్క్‌షాప్‌

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

నల్లగొండ : నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆడిటోరియంలో సోమవారం సాగర్‌ పరిసర ప్రాంతాల జర్నలిస్టులకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సోషల్‌ మీడియాపై వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక జర్నలిస్టులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. వర్క్‌షాప్‌కు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.

మూసీ రైతులు

ఆందోళన చెందవద్దు

కేతేపల్లి : మూసీ ఆయకట్టులో వచ్చే యాసంగికి సాగు నీటి విడుదలపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మూసీ ప్రాజెక్టు డీఈ ఎన్‌.రమేష్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. వానాకాలం సీజన్‌కు ప్రస్తుతం నీటి విడుదల కొనసాగుతున్నందున ఆయకట్టు చివరి భూముల్లో ఆలస్యంగా వరి నాట్లు వేసిన రైతులు చేసిన విన్నపం మేరకే కాల్వలకు మూడో విడత నీటి విడుదలను ఈనెల 15 వరకు కొనసాగిస్తామని తెలిపారు. పది రోజుల విరామం అనంతరం నాలుగో విడతగా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పేరుతో మూసీ ప్రాజెక్టును ఖాళీ చేసేందుకే వానాకాలం సీజన్‌లో అధికారులు కాల్వలకు నీటిని నిరంతరం విడుదల చేస్తున్నారనే వస్తున్న అపోహలను రైతులు నమ్మవద్దని కోరారు. వానాకాలం సీజన్‌ ముగిసిన అనంతరం ప్రాజెక్టులో ఉన్న నీటినిల్వల ఆధారంగా ఆయకట్టు రైతులు, ప్రజాప్రతినిధులతో చర్చించి యాసంగి సాగుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

24న స్వర్ణకారుల

శంఖారావం

నల్లగొండ : హైదరాబాద్‌లో ఈ నెల 24న తెలంగాణ స్వర్ణకారుల శంఖారావం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ గిరి తెలిపారు. ఆదివారం నల్లగొండలోని సంఘం కార్యాలయంలో స్వర్ణకారుల సంఘం నాయకులతో కలిసి శంఖారావం బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. 24న స్వర్ణకారులు తమ దుకాణాలను బంద్‌ చేసి సభకు తరలి రావాలని కోరారు. స్వర్ణకారుల సంక్షేమం కోసం స్వర్ణకార కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఇనుగుర్తి గోవర్ధనాచారి, కూరల మదనాచారి, గొట్టిముక్కల చంద్రశేఖర్‌, చెల్లేటి హరిప్రసాద్‌, చలమాచారి, మహేష్‌బాబు, కిషన్‌, లక్ష్మణ్‌, కోరెల్ల వెంకటేశ్వర్లు, రాజీపల్లి విష్ణుమూర్తి, మహేష్‌ బ్రహ్మచారి, జిల్లెపల్లి విజయకుమార్‌ పాల్గొన్నారు.

యాదగిరీశుడికి

విశేష పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు ఆదివారం నిత్య కై ంకర్యాలను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభూలకు అభిషేక పూజ జరిపించారు. అనంతరం తులసీ దళాలతో సహస్ర నామార్చన, కుంకుమార్చన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement