ఫ మంత్రి కోమటిరెడ్డి
వెంకట్‌రెడ్డి
కనగల్ : జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం కనగల్ మండలం తేలకంటిగూడెం, ఎస్.లింగోటంలో రూ.74 కోట్లతో చేపట్టనున్న రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు రెండు పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే తన జీవిత లక్ష్యమన్నారు. గంధమల్ల, బస్వాపురం ప్రాజెక్టుల పనులను కూడా వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణలో రహదారులను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ ఆవ వేదరక్షిత, ఆర్‌అండ్‌బీ డీఈ గణేష్ ,నాయకులు గడ్డం అనూప్‌రెడ్డి, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, గోలి జగాల్‌రెడ్డి, బిల్లపాటి మోహన్‌రెడ్డి, కేసాని వెంకట్‌రెడ్డి, పోషమల్ల లింగయ్య గౌడ్, ఎస్.రమణారెడ్డి, బూసిరెడ్డి రమేష్‌రెడ్డి, సర్పంచ్‌లు ఓర్సు పెంటయ్య, బైరు నాగమణి నాగయ్యగౌడ్, పోషమల్ల సురేష్‌గౌడ్, గోగు గోవర్ధన్‌రెడ్డి, నర్సింగ్ మురళీధర్‌గౌడ్, రావుల మల్లేష్, మల్లికంటి సుజాతరాజు, నామిరెడ్డి నరేందర్‌రెడ్డి, చిలకరాజు సునీతవెంకన్న, నల్లబోతు నిర్మల తదితరులు పాల్గొన్నారు.


