అందరూ గాంధీ బాటలో నడవాలి | - | Sakshi
Sakshi News home page

అందరూ గాంధీ బాటలో నడవాలి

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

నల్లగొండ : మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ గాంధీ బాటలో నడవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన నల్లగొండ రామగిరిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బాపూజీ చెప్పారని, వారి ఆదర్శాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మూసీ దగ్గరలో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు పేరున మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిందని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మహాత్మా గాంధీ బాటలో నడుస్తూ గ్రామపంచాయతీ నిధులను నేరుగా సర్పంచ్‌ల ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో కుల, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారత స్వతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహానీయుడు మహాత్మాగాంధీ అని చెప్పారు. మేయర్‌ బుర్రి చైతన్య మాట్లాడుతూ అహింస, సత్యం అనే ఆయుధాలతో గాంధీ భారతదేశ స్వాతంత్రాన్ని సాధించారని, వారి అడుగుజాడల్లో అందరూ నడవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, దేవరకొండ సబ్‌ కలెక్టర్‌ కరోలిన్‌ చింగ్‌ తియాన్‌ మావి, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, తహసీల్దార్‌ పరశురాం, కార్పొరేటర్‌ కవిత పాల్గొన్నారు.

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement