పరిసరాలను పరిశుభ్రతతోనే రక్షణ | - | Sakshi
Sakshi News home page

పరిసరాలను పరిశుభ్రతతోనే రక్షణ

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

పరిసరాలను పరిశుభ్రతతోనే రక్షణ

నల్లగొండ టూటౌన్‌ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే ఆరోగ్యానికి రక్షణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బుధవారం నల్లగొండకు వచ్చిన ఆయన పాతబస్తీ హిందూపూర్‌లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా రోడ్లను ఊడ్చారు. ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకొని స్వచ్ఛత అభియాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హనుమాన్‌నగర్‌లోని హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత డీవీకే రోడ్డులోని చైతన్యపురి కాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన తల్లిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వీరెళ్లి చంద్రశేఖర్‌, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, పోతెపాక లింగస్వామి, సైదులు, పోతెపాక సాంబయ్య, పెరిక మునికుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement