ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతో అధిక ఆదాయం

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

గరిడేపల్లి : ప్రకృతి వ్యవసాయంతో తక్కువ వ్యయంతోనే అధిక ఆదాయం పొందవచ్చని కేవీకే శాస్త్రవేత్త సీహెచ్‌.నరేష్‌ అన్నారు. సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజ మాన్య సంస్థ (ఆత్మ), హుజూర్‌నగర్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో రికగ్నిషన్‌ ఆఫ్‌ ప్రియర్‌ లెర్నింగ్‌ (ఆర్‌పీఎల్‌) కార్యక్రమంలో భాగంగా గడ్డిపల్లి కేవీకేలో ప్రకృతి వ్యవసాయంపై సీనియర్‌ సైంటిస్ట్‌ అండ్‌ హెడ్‌ ఇన్‌చార్జి డి.నరేష్‌ ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలను సాగు చేసే విధానాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే సమగ్ర వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో భాగంగా వివిధ పంటలకు ఉపయోగించే ద్రావణాలు, కషాయాలను రైతుల చేత స్వయంగా తయారు చేయించి, వాటిని పంటల్లో వినియోగించే విధానంపై ప్రాయోగిక శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఆత్మ డిప్యూటీ డైరెక్టర్‌ జి.నివేదిత, ఆర్‌.రవి, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ పి.అక్షిత్‌ సాయి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement