5 నుంచి బీటెక్‌ తరగతులు | - | Sakshi
Sakshi News home page

5 నుంచి బీటెక్‌ తరగతులు

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీటెక్‌ మొదటి సంవత్సరం, పీజీ మూడో సెమిస్టర్‌ తరగతులు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు శాతం నియమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరు కావాలని సూచించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన అంశాలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 58 మంది బాధితులు వినతులు అందజేశారు. సంబంధిత పోలీస్‌ అధికారులు ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పీహెచ్‌డీ

నోటిఫికేషన్‌ విడుదల

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూని వర్సిటీలోని వివిధ విభాగాల్లో 2024–25, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ఆకుల రవి సోమవారం విడుదల చేశారు. కామర్స్‌లో 1, ఇంజనీరింగ్‌, టెక్నాలజీలో 13, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో 18, బయో కెమిస్ట్రీలో 5, కెమిస్టీలో 31, మ్యాథ్స్‌లో 8, ఎకనామిక్స్‌లో 6, ఇంగ్లిష్‌లో 2 భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఎంజీ యూనివర్సిటీలో సంప్రదించాలని సూచించారు.

ప్రొఫెసర్‌ బెల్లి యాదయ్యకు సన్మానం

నకిరేకల్‌ : తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్‌ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నకిరేకల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రొఫసర్‌ డాక్టర్‌ బెల్లి యాదయ్యను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ నాగు మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి బెల్లి యాదయ్య అంచలంచెలుగా ఎదిగారని చెప్పారు. కార్యక్రమంలో ప్రవీణ్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌, హరిత, ఉపేందర్‌, రవీందర్‌, ఉదయ్‌కుమార్‌, సుభాషిణి, వెంకన్న, సుదర్శన్‌, వెంకట్‌రెడ్డి, కార్తిక్‌ పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి రూ.116 కోట్లు

నకిరేకల్‌ : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లు కేటాయించిందని మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కనుకు వెంకటనారాయణ తెలిపారు. నకిరేకల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా రూ.23 కోట్లు కేటాయించడం ద్వారా మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. ఈ నిధులు మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి ప్రత్యేక చొరవతోనే సీఎం రేవంత్‌రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. సమావేశంలో ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి, సాదుల నర్సయ్య, సూర శంకర్‌, మాదాసు చంద్రశేఖర్‌, వెంకన్న, లక్ష్మీవెంకటయ్య, అజయ్‌కుమార్‌, వీరయ్య, కోట్ల సైదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement