నల్లగొండ టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లందుకుకల్పించేందుకు సీసీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సోమవారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్రజాచైతన్య యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయితేనే జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి నిర్ణిత గడువులోగా వాటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోతున్న వరి పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, మల్లేపల్లి ఆదిరెడ్డి, నల్పరాజు రామలింగయ్య, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, అంజాచారి, బంటు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, తూము బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.


