ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

నిడమనూరు : వర్షాభావాన్ని ఆసరా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్న ట్రాన్స్‌కో అక్రమార్కులపై చర్యల్లో భాగంగా మరో ఇద్దరిపై వేటు పడింది. ముకుందాపురం సెక్షన్‌లో తుమ్మడం ఆర్టిజన్‌గా విధులు నిర్వహిస్తున్న మదనాచారి(రాము) జూనియర్‌ లైనమన్‌ నాగయ్య సస్పెన్షన్‌ చేస్తూ మిర్యాలగూడ డీఈ శ్రీనివాసచారి ఉత్తర్వులు జారీ చేశారు.

కాంట్రాక్టర్లపై చర్యలు ఉండేనా..!

విద్యుత్‌ అధికారులకు అక్రమాలకు విద్యుత్‌ కాంట్రాక్టర్ల ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నిడమనూరు మండలంలో 26 మందికిపైగా కాంట్రాక్టర్లు ఉండగా.. ముగ్గురు, నలుగురికి మాత్రమే కాంట్రాక్టు పనులను ఇస్తున్నారని తెలిసింది. గతేడాది ముప్పారం వద్ద ఒక విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుడి మృతికి కారణమైన లైన్‌మన్‌కు మూడు రోజులకే పోస్టింగ్‌ తెచ్చుకున్నారని.. ఇలా కాంట్రాక్టర్ల జోక్యంపై కూడా చర్యల తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రుద్రమదేవి

శిలాశాసనం సందర్శన

నకిరేకల్‌ : మండలంలోని చందుపట్లలో రుద్రమదేవి విగ్రహం పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక వివేకానంద యువజన మండలి సభ్యులు వినతి మేరకు రాణి రుద్రమదేవి శిలా శాసనాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)

సివిల్‌ ఇంజనీర్‌ శివం కంబోజ్‌, డిప్యూటీ మేనేజర్‌ ఆళ్ల కృష్ణరావు, సీనియర్‌ అసోసియేట్‌ గోశిక సాయికుమార్‌ సోమవారం సందర్శించారు. అధికారుల బృందం సోమవారం సందర్శించింది. శాసనంతో పాటు విగ్రహన్ని పరిశీలించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికులతో చర్చించారు. త్వరలోనే సమగ్ర ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తామని హమీ ఇచ్చారు. వారి వెంట సర్పంచ్‌ లతావెంకటాచారి, కోటేష్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement