మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి గతంలో 250 నుంచి 300 వచ్చే రోగుల సంఖ్య ప్రస్తుతం 400కు పైగా చేరింది. వైద్యులు సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం లేదు. ఆలస్యంగా వచ్చిన కొందరు వైద్యులు 12గంటలు కూడా కాకముందే బయట ఉన్న తమ ప్రైవేటు క్ల్టినిక్‌లకు వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో 20 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏరియా ఆస్పత్రిలో స్కానింగ్ సౌకర్యం లేదు. ఆస్పత్రిలో పారిశుద్ద్యం అధ్వానంగా ఉంది. ఓపీ సమీపంలో ఉండే వాష్‌రూంలో దుర్గంధం వెదజల్లుతోంది. రోగులకు వడ్డించే అన్నం మొనూ ప్రకారం ఉండటం లేదని రోగులు వాపోతున్నారు.
నాకు జ్వరం, జలుబు ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి వచ్చాను. పరీక్షించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందేమో చూసేందుకు ఎక్స్‌రే తీయించాలని చెప్పారు. కానీ, ఆసుపత్రిలో ఎక్స్ రే సదుపాయం అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక బయట ప్రైవేట్ ల్యాబ్‌లోనే డబ్బులు పెట్టి తీయించుకోవాల్సి వచ్చింది.
– కోరె లక్ష్మమ్మ, కత్తాల్‌గూడ, నల్లగొండ


