
కాంగ్రెస్‌లో మదర్ డెయిరీ మంటలు!
పాడి భవిష్యత్ కోసమే..
సాక్షి, యాదాద్రి: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్ (నార్ముల్ మదర్ డెయిరీ) పాలకవర్గ ఎన్నికలు కాంగ్రెస్‌లో చిచ్చు రగిల్చాయి. మూడు డైరెక్టర్ల స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు స్నేహపూర్వక పొత్తు కుదర్చుకోవడంతో అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మూడు చోట్ల గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌తో పొత్తు ఎందుకని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన బీఆర్‌ఎస్ నాయకున్ని మీరు ఏ విధంగా గెలిపిస్తారని మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల అయిలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఎమ్మెల్యే సామేల్‌కు ఫోన్ చేసి విషయంపై వాకబు చేశారు. అయితే పోటీలో ఉన్న మోతె పూలమ్మ, పిచ్చిరెడ్డికి ఇచ్చిన షోకాజ్ నోటీస్ చర్చనీయాంశంగా మారింది. పిచ్చిరెడ్డి సైతం బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు.
308 మంది పాల చైర్మన్లు
మూడు డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 308 మంది పాలసొసైటీ చైర్మన్లు ఓటింగ్‌లో పాల్గొంటారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ చైర్మన్లను శుక్రవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ సమీపంలోకి క్యాంపులకు తరలించారు. శనివారం ఉదయం క్యాంప్‌ల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ అనంతరం మధ్యాహ్నం ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఒక మహిళ, రెండు జనరల్ స్థానాలకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వీరిలో మహిళ, ఒక జనరల్ డైరెక్టర్ స్థానాలకు కాంగ్రెస్, ఒక డైరెక్టర్ స్థానానికి బీఆర్‌ఎస్ పార్టీ గెలిచేలా ఇరు పార్టీల నాయకులు ఒప్పందం చేసుకున్నారు.
పోటీలో ఉన్నదీ వీరే..
కర్నాటి జయశ్రీ, గంట్ల రాధిక, మోతె పూలమ్మ, సూధగాని విజయ, కుంచాల ప్రవీణ్‌రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, శీలం వెంకటనర్సింహారెడ్డి, సందిల భాస్కర్ గౌడ్.
మూడు డైరెక్టర్ల స్థానాలకు నేడు ఎన్నికలు
ఫ స్నేహపూర్వక పొత్తు కుదర్చుకున్న అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం
ఫ కాంగ్రెస్‌కు రెండు, బీఆర్‌ఎస్‌కు ఒకటి
ఫ పొత్తుపై తుంగతుర్తి ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
పాడి రైతుల భవిష్యత్ కోసమే బీఆర్‌ఎస్‌తో పొత్తుకు దిగినట్లు చైర్మన్ గుడిపాటి చెబుతున్నారు. నార్మాక్స్‌ను ఎన్‌డీడీబీకి అప్పగించేందుకు బీఆర్‌ఎస్ సహకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఈనెల జరిగే జనరల్ బాడీ సమావేశంలో ఎన్‌డీడీబీకీ అప్పగిస్తూ పాలక వర్గం తీర్మానం చేసి ఇవ్వాల్సి ఉంది. పాలకవర్గంలో బీఆర్‌ఎస్ డైరక్టర్లు ఉన్నారు. అయితే తమకు ఒక స్థానం ఇస్తే తీర్మానంలో సహకరిస్తామని ఇచ్చిన హామీ మేరకు బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం కేటాయించినట్లు చైర్మన్ సాక్షితో చెప్పారు.