మున్సిపాలిటీలు.. మారాలిక! | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలు.. మారాలిక!

Jun 16 2025 7:03 AM | Updated on Jun 16 2025 7:03 AM

మున్స

మున్సిపాలిటీలు.. మారాలిక!

పట్టణాల అభివృద్ధికి వంద రోజుల ప్రణాళిక

సమస్యలు తీరేనా...?

మున్సిపాలిటీలో గత ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతిలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని అప్పటి ప్రభుత్వ పెద్దలు, మున్సిపాలిటీల ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పినా కార్యాచరణలో కనపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆదేరీతిలో వందరోజుల ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని రూపొందించినా అది కూడా గతం మాదిరి కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వార్డులలో దీర్ఘకాలికంగా సమస్యలు వేదిస్తున్నా అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం వార్డుల్లో చేపట్టే పనులను పూర్తిచేసి ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు

పచ్చదనం పెంపునకు మొక్కల పంపిణీ

తడి, పొడి చెత్తపై అవగాహన సదస్సులు

సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యాచరణ

హాలియా, దేవరకొండ : మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, మెరుగు, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వంద రోజుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్‌ 2వ తేదీ) నుంచి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు, దీర్ఘకాలికంగా నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది. జూన్‌ 2వ తేదీ నుంచి వంద రోజులపాటు ఒక్కో కార్యక్రమం చేపట్టేలా కార్యాచరణ రచించింది. వందరోజుల యాక్షన్‌ ప్లాన్‌కు అనుగుణంగా ఇప్పటికే జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోని వార్డు అధికారులకు బాధ్యతలు కేటాయించింది. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను నోట్‌ చేసుకుంటున్నారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో తీర్చేలా బడ్జెట్‌ కేటాయించి పనులు పూర్తిచేసేలా చూడనున్నారు.

వంద రోజుల కార్యాచరణలో

చేపట్టే పనులు ఇలా..

● రాబోయే సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్‌ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

● మున్సిపాలిటీలో తాగునీటి వనరులు శుభ్రం చేయడంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, క్లోరినేషన్‌ వేయడం, అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచనున్నారు.

● పచ్చదనం పెంపులో భాగంగా మొక్కలు నాటనున్నారు.

● ఇంకుడు గుంతలు లేని ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పిస్తారు.

● డ్రెయినేజీల్లో పూడికతీత, పారిఽశుద్ధ్య వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు మురికి వాడల్లో అధికారులు పర్యటించనున్నారు.

● ఆస్తి, నీటి, వాణిజ్య పన్నుల వసూళ్లపై వార్డు అధి కారులు ప్రత్యేక దృష్టిని సారించడంతో పాటు ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహిస్తారు.

● మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

● శిథిలావస్థలోకి చేరిన ఇళ్లను వార్డు ఆఫీసర్లు పూర్తిస్థాయిలో గుర్తించనున్నారు.

● ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం తొలగించడంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించనున్నారు.

● మున్సిపాలిటీల్లో నూతన సమభావన సంఘాల ఏర్పాటు గుర్తింపు, మహిళా సంఘాలకు వ్యక్తిగత రుణాలు ఇప్పించనున్నారు.

● చేతి వృత్తుల్లో భాగంగా జ్యూట్‌ బ్యాగుల తయారీ దారులను గుర్తించి వారికి రుణాలను ఇప్పిస్తారు.

● స్ట్రీట్‌ వెండర్స్‌ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలి.

● పట్టణాల్లో కొత్తగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేయనున్నారు.

● తాగునీటి సరఫరా మెరుగుపర్చడం, పైపులైన్‌ లీకేజీలను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయనున్నారు.

● భువన్‌ యాప్‌లో ఇళ్ల లెక్క పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఇంటిని యాప్‌లో నమోదు చేయనున్నారు.

● ప్రైవేట్‌ ఆసుపత్రుల సహకారంతో కార్మికులకు వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. మందులు పంపిణీ చేయనున్నారు. కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ వారి ఖాతాల్లో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

మున్సిపాలిటీలు.. మారాలిక!1
1/1

మున్సిపాలిటీలు.. మారాలిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement