
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
చిట్యాల: బస్సులో ప్రయాణికురాలు మరచిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను భద్రపరిచి తిరిగి ఆమెకు అందజేసి తన నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్ జంగయ్య. వివరాలు.. నల్లగొండ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎల్లారెడ్డిగూడెం నుంచి చిట్యాలకు వస్తున్న యువతి తన హ్యాడ్బ్యాగ్ను మరిచిపోయి చిట్యాల బస్టాండ్‌లో దిగి వెళ్లిపోయింది. అనంతరం ఆ యువతి కార్గో సెంటర్ నిర్వాహకుడు పొలిమెర దశరథ ద్వారా కండక్టర్‌కు సమాచారం అందించింది. దీంతో హ్యాండ్‌బ్యాగును కండక్టర్ తీసుకుని తన వద్ద భద్రపరుచుకున్నాడు. వెంటనే రామన్నపేటకు వచ్చిన యువతికి కండక్టర్ జంగయ్య ఆహ్యాండ్బ్యాగు అందజేసి నిజాయితీ చాటుకున్నాడు.