
రోడ్డు విస్తరణకు సహకరించాలి
చండూరు: రోడ్డు విస్తరణ పనులకు స్థానిక దుకాణదారులు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మార్నింగ్ వాక్‌లో భాగంగా బంగారిగడ్డ, చండూరులో ఎమ్మెల్యే పర్యటించారు. బంగారిగడ్డలో ఆరోగ్యకేంద్రం నిర్మించే స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. బంగారిగడ్డలోని గట్టుప్పల్–చౌటుప్పల్ కూడలి అభివృద్ధిపై చర్చించారు. చండూరు పట్టణంలో రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ పనులను పరిశీలించారు. మెయిన్ సెంటర్‌లో ఇంకా విస్తరణ పనులు చేయాల్సిన 400 మీటర్ల విషయంలో దుకాణదారులతో మాట్లాడారు. రోడ్డు విస్తరణ జరిగితే పట్టణ ప్రజలకే మేలు జరుగుతుందని, రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. ఇచ్చిన మాటప్రకారం చండూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పుష్పలత, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కొరిమి ఓంకారం, అనంత చంద్రశేఖర్‌గౌడ్, జిల్లా నాయకుడు కావలి ఆంజనేయులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాతవెంకటేశ్, కోడి శ్రీనివాసులు, కోడి గిరిబాబు, కల్లెట్ల మారయ్య, మల్లేశం, శేఖర్, వెంకటేశ్, దశరథ, సైదులు, లింగయ్య, వేణు, రాజశేఖర్, రామ్మూర్తి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి