హజ్‌ యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం

Mar 26 2026 10:29 AM | Updated on Mar 26 2026 10:29 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లా నుంచి హజ్‌ యాత్రకు వెళ్తున్న యాత్రికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్‌ తెలిపారు. బుధవారం జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో హజ్‌ యాత్రికులకు పలు పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధినిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. హజ్‌ యాత్రికులకు షుగర్‌, బీపీ, రక్త పరీక్షలు, ఎక్స్‌రే నిర్వహించడంతో పాటు జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్లచే పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారికి అవసరమైన వ్యాక్సిన్లు అందించి.. సురక్షితంగా యాత్ర సాగించేందుకు వైద్య చర్యలు తీసుకున్నామని వివరించారు. కార్యక్రమంలో హజ్‌ సొసైటీ అధ్యక్షుడు ఫరీద్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.ఉషారాణి, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.సురేశ్‌బాబు, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌ఓడీ డా.సూర్యనారాయణ, పీపీ యూనిట్‌ వైద్యాధికారి డా.సృజన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement