చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిర్సనగండ్ల నుంచి భక్తులు, గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా గుట్టపై నున్న ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాములు మాస కల్యాణ ఘట్టం కనులపండువగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలి వచ్చి వేడుకను తిలకించారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు, తహసీల్దార్ ఉమదంప తులు, ఎస్‌ఐ వీరబాబు దంపతులు, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఆలయ మాజీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సర్పంచ్ రామస్వా మి దంపతులు, ఉప సర్పంచ్ కల్లు సురేందర్‌రెడ్డి దంపతులు కల్యా ణంలో కూర్చున్నారు. అనంతరం భక్తులకు సిర్సనగండ్లకు చెందిన పిన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి అన్నదానం చేశారు.కార్యక్రమంలో మే నేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, వేణుశర్మ, కోదండ రామశర్మ, మురళీధర్‌శర్మ, గోపిశర్మ, ప్రవీణ్ శర్మ, అనంత రామశర్మ, , నాయకులు వెంకట్‌గౌడ్, బాల్‌రాంగౌడ్, సందీప్‌రెడ్డి, నర్సింహారెడ్డి,ప్రశాంత్ నాయక్, సాంబయ్యగౌడ్ ఉన్నారు.
పటిష్ట నిఘా..
ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు, సీసీ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు.
ప్రత్యేక బస్సులు
బ్రహ్మోత్సవాలకు మహబుబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు.
ఉత్సవాలకు హాజరైన భక్తులు


