గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం

Mar 27 2026 10:08 AM | Updated on Mar 27 2026 10:08 AM

ఉప్పునుంతల: అచ్చంపేట పట్టణంలో కొసాగుతున్న మండలంలోని వెల్టూరు బాలికల గురుకుల పాఠశాలలో గురువారం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన విద్యార్థినులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి స్వప్న ఆరోగ్య విషయాలను వివరించారు. వేసవిలో ఎండలకు కనీసం నాలుగు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలని సూచించారు. భవిషత్తులో గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా ప్రభుత్వం ఇస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. డాక్టర్‌ అభిలాష్‌, సూపర్‌వైజర్‌ ప్రభావతి, నవ్య, హెల్త్‌ అసిస్టెంట్‌ జగదీష్‌, ఏఎన్‌ఎం జ్యోతి పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

తెలకపల్లి/అమ్రాబాద్‌/వెల్దండ: తెలకపల్లి మండలంలోని గౌరారంలో గురువారం 8, 9, 10వ వార్డులలో సర్పంచ్‌ మల్లేశ్వరి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అదేవిధంగా అమ్రాబాద్‌ మండలంలోని మొల్కమామిడిలో రూ.10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్‌ శాంతమ్మ, డిప్యూటీ సర్పంచ్‌ జీవన్‌రెడ్డి, వెల్దండ మండల కేంద్రంలోని 4వ వార్డులో సర్పంచ్‌ మట్టయాదమ్మ వెంకటయ్యగౌడ్‌ సీసీరోడ్డు పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌నాయక్‌, లింగంయాదవ్‌, వెల్దండ ఉపసర్పంచ్‌ శ్రీనివాసులు, వార్డు సభ్యులు జంగిలి సునీత, మల్లీశ్వరి, కవిత, ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement