అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

Mar 27 2026 10:08 AM | Updated on Mar 27 2026 10:08 AM

లింగాల: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న యూరియాను గ్రామస్తులు పట్టుకున్న సంఘటన గురువారం రాత్రి మండలంంలోని అప్పాయపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇతర ప్రాంతానికి చెందిన రైతులు ఒక్కో బస్తా రూ.1,000 వరకు చెల్లించి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిని గమనించిన స్థానికులు కొంత మంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూరియాను తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దాదాపుగా 20 బస్తాల వరకు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన యూరియా బస్తాలను వ్యవసాయ శాఖ వారికి అప్పజెప్తామని హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తెలిపారు.

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు

దరఖాస్తుల ఆహ్వానం

కోడేరు: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ బలరాంనాయక్‌ తెలిపారు. ఏప్రిల్‌ 2 వరకు దరఖాస్తు గడువు ఉందన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

తైబజార్‌ వేలం

వెల్దండ: మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో సర్పంచ్‌ మట్ట యాదమ్మ అధ్యక్షతనగా గురువారం కూరగాయల తైబజార్‌ వేలం పాట నిర్వహించారు. గ్రామానికి చెందిన దాదాపుగా 20 మంది వేలం పాటలో పాల్గొనడంతో గుద్దటి జానార్దన్‌ రూ.2.30 లక్షలకు తైబజార్‌ దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ శ్రీనివాసులు, ఎంపీఓ లక్ష్మణ్‌, కార్యదర్శులు గిరిగౌడు, ఫయాజ్‌, హజిబాబా, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

సీఎం చిత్రపటానికి

క్షీరాభిషేకం

కల్వకుర్తి టౌన్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డీసీహెచ్‌గా మార్చేందుకు శాసనసభలో బిల్లు పెట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పట్టణంలోని సీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది గురువారం ఆస్పత్రి ఆవరణలో క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ శివరాం తెలిపారు. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement