ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

Mar 27 2026 10:08 AM | Updated on Mar 27 2026 10:08 AM

కొల్లాపూర్‌: ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దకొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌, వెన్నచెర్ల సర్పంచ్‌ సూర్య నారాయణమ్మ సూచించారు. గురువారం వెన్నచెర్లలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బై రాముడు, రవికుమార్‌, వి.సత్యం, పగడాల చిన్నయ్య, ప్రశాంత్‌, బాలింగచారి, సుదర్శన్‌, స్వామి, చెన్నమ్మ తదితరులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీ పరిశీలన

తాడూరు: మండలంలోని చర్ల తిర్మలాపూర్‌, లచ్చిరాంతండాలలో మండల స్థాయి అధికారుల బృందం గురువారం ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీలను పరిశీలించింది. ఈ సందర్భగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. లచ్చిరాంతండాలో నర్సరీని సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంపీఓ ప్రశాంత్‌, ఏపీఓ చంద్రసిద్దార్థ, విరాచారి, సర్పంచ్‌లు గాజుల కృష్ణ, కుర్మనాయక్‌, పాల్గొన్నారు.

కూలీలకు కనీస వసతులు కల్పించాలి

ఉప్పునుంతల: మండలంలో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనుల వద్ద కూలీలకు కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు ఎంపీడీఓ రేవతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement