ఉప్పునుంతల: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి హెచ్చరించారు. గురువారం మొల్గర సమీపంలో దుందుబీ వాగులో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇసుక రీచ్‌ను ఆయన సందర్శించారు. ఆన్‌లైన్ బుకింగ్ చేసకున్న వినియోగదారులకు ఏవిధంగా ఇసుక చేరుతుందని మైనింగ్ శాఖ రీచ్ ఇన్‌చార్జ్ అడిగి తెలుసుకున్నారు. అక్రమ ఇసుక తరలింపుపై స్థానిక తహసీల్దార్, ఎస్‌ఐ తరచుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఆర్డీఓతోపాటు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో పల్లకీ సేవ
తిమ్మాజిపేట: మండలంలోని అప్పాజిపల్లిలో గురువారం సీతారామచంద్రాస్వామి పల్లకీ సేవలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణ్, హనుమంతుడి ప్రతిమలను అందంగా అలంకరించిన పల్లకీలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని శ్రీవేద విశ్వనాథ మందిరం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వాల్మీకి దేవాలయం వరకు భజన, భక్తి పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించారు. మాజీ సర్పంచ్ జల్లి తిరుపతమ్మ, వాల్మీకి నాయకులు జల్లి వెంకటయ్య, జల్లి రమేష్, సుందరయ్య, కుర్మయ్య, చెన్నయ్య, శివ,పలువురు మహిళలు పాల్గొన్నారు.


