పారదర్శకంగా కేసుల విచారణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా కేసుల విచారణ

Mar 26 2026 10:29 AM | Updated on Mar 26 2026 10:29 AM

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు త్వరగా న్యాయం జరిగే విధంగా చూడటమే పోలీసుల ప్రధాన బాధ్యత అని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి చార్జిషీట్‌ వరకు ప్రతి అంశంలో పారదర్శకత ఉండాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లుతో కలిసి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేయాలన్నారు. న్యాయస్థానంలో నేరస్తులకు శిక్ష పడేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించాలన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టి.. బాధితులకు భరోసానివ్వాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో బాధితులకు నగదు త్వరగా అందేలా చూడాలన్నారు. చోరీలకు అడ్డుకట్ట వేసేందుకు పెట్రోలింగ్‌ పెంచాలన్నారు. సైబర్‌ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు సాయి వెంకట్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌ ఉన్నారు.

ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement