రిజర్వాయర్ నిర్మాణానికి భూములివ్వం
● భూసేకరణ నిలిపివేయాలనినిర్వాసిత రైతుల ఆందోళన
● నిరసన ర్యాలీతో తహసీల్దార్‌కు వినతి
బల్మూర్: ప్రాణత్యాగలకై నా వెనకాడం.. తమ భూములను రిజర్వాయర్ నిర్మాణానికి ఇచ్చేదిలేదని నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి సమీపంలో నిర్మంచతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులు బుధవారం భూసేకరణ కార్యక్రమం చేపట్టడంతో విషయం తెలుసుకున్న బల్మూర్, అనంతవరం, అంబగిరి రైతులు నిరసన ర్యాలీ చేపట్టి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. అధికారులు తమకు ఎలాంటి నోటీసులు అందజేయకుండానే కేవలం ఫోన్‌ల ద్వారా కొంతమంది రైతులకు సమాచారం ఇచ్చి భూసేకరణకు పూనుకోవడం సరైందికాదని ప్రశ్నించారు. రిజర్వాయర్ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైనది కాకున్నా.. కేవలం కాట్రాక్టర్లు, పాలకుల కమీషన్ల కకక్కురర్తి కోసమే నిర్మించ తలపెట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ రిజర్వాయర్ నిరర్మించాలంటే పీసా చట్టం ప్రకారం అధికారులు నడుచుకోవాల్సి ఉనన్నా.. నిబంధనలు ఉల్లంగించి రైతుల భూములను లాక్కొనే ప్రయతత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, లేకుంటే తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. భూనిర్వాసిత పోరాట కమిటీ సభ్యులు అనంత సీతారాంరెడ్డి, తిరుపతయ్య, నాగయ్య, కృష్ణయ్య, ఇంద్రసేనారెడ్డి, గణేశ్, రైతులు పాల్గొన్నారు.


