ఎన్నికల పరిశీలకుల నియామకం
నాగర్‌కర్నూల్: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ఇందులో భాగంగా సాధారణ పరిశీలకులుగా హైదరాబాద్ హెచ్‌ఎండీఏ జాయింట్ కలెక్టర్ రాజ్యలక్ష్మి, వ్యయ పరిశీలకులుగా గద్వాల జిల్లా ఆడిట్ అధికారి భీమ్లానాయక్‌ను నియమించారు. ఈ మేరకు గురువారం వారు కలెక్టర్ బదావత్ సంతోష్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, డీపీఓ శ్రీరాములు, అబ్జర్వర్ లైజింగ్ అధికారి సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతోనేవిద్యార్థుల్లో క్రమశిక్షణ
కందనూలు: క్రీడల ద్వారానే విద్యార్థులకు క్రమశిక్షణ అలవడుతుందని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో 44వ జూనియర్స్ ఖోఖో కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువులో రాణించాలంటే నిత్యం ఆటలు ఆడడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడినైనా ఎదుర్కొనే ధైర్యం, సాహసాలు అలవాడుతాయన్నారు. యువతీ, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ నిత్యం క్రీడల్లో నిమగ్నమై అనుకున్న స్థాయికి చేరుకోవాలని సూచించారు. జూనియర్స్ ఖోఖో కోచింగ్ క్యాంపులో మంచి మెలకువలు నేర్చుకొని రాష్ట్రస్థాయిలో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఏఎస్పీ వెంకటేశ్వర్లు క్రీడా కిట్టును బాలికలకు, బాలురకు అందజేశారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అడ్డొస్తున్నాడని..
తుదముట్టించారు
ఎన్నికల పరిశీలకుల నియామకం


