బాలాలయం ముస్తాబు! | - | Sakshi
Sakshi News home page

బాలాలయం ముస్తాబు!

Jun 16 2026 1:16 AM | Updated on Jun 16 2026 1:16 AM

శ్రీ ఆదిముక్తీశ్వరాలయం వద్ద

ఏర్పాట్లు ముమ్మరం

రేపు పునరుద్ధరణ,

తొలగింపు ప్రక్రియ షురూ

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేఽశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈనెల (రేపు) 17న బుధవారం ఉదయం 8.15 గంటలకు కళాప్రకర్షణ క్రతువుతో శృంగేరి పీఠాధిపతి శిష్య బృందంచే విశేష పూజలతో ఆరంభం కానుంది. రూ.198కోట్ల వ్యయంతో ఆలయ పునరుద్ధరణ, ఆలయాల తొలిగింపు కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుత దేవస్థానానికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న శ్రీఆదిముక్తీశ్వరాలయం వద్ద అభిషేక పూజలు నిర్వహించడానికి దేవాదాయశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న షెడ్డులో బాలాలయాలు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అందులోనే ఉత్సవ మూర్తులు శ్రీశుభానందముక్తీఽశ్వరులు, సరస్వతీ అమ్మవార్లను ఆసీనులు చేసి భక్తుల దర్శనాలకు వీలు కల్పించనున్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. రెండు కంటెయినర్లలో కార్యాలయం, టిక్కెట్లు, ప్రసాద విక్రయాలు జరపనున్నారని తెలిసింది. ఇంకా కాలసర్ప, శని పూజలకు నిర్ణయాలు తీసుకోలేదని తెలిసింది. ఈ మేరకు మంగళవారం దేవా దాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు స్థానికుల అభిప్రాయాలు తీసుకోనున్నారని సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement