జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 2,189 మంది లబ్ధిదారులకు రూ. 22.87 కోట్ల రుణం అందజేశాం. ఇంకా అందజేయాల్సి ఉంది. బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు కావాల్సిన రుణం ఇప్పించడంలో సెర్ప్ సిబ్బంది ప్రత్యేక భూమిక పోషిస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా గ్రూపు సభ్యుల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించి వారికి వెన్నుదన్నుగా ఉంటాం. ఈ ప్రక్రియ నిరంతరమైంది. లబ్ధిదారులు ఎవరైనా రుణం కావాలంటే మండల సమాఖ్య కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించాలి. – శ్రీనివాస్, డీఆర్‌డీఓ పీడీ


