లెక్క తేలింది..!
ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల పోరులో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 159 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం 76 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి 20 వార్డులకు ప్రతీ పార్టీ నుంచి 20 మంది చొప్పున మొత్తంగా 60 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదే విధంగా 21 మంది స్వతంత్రులు, ఇద్దరు సీపీఎం నుంచి మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచారు.
ప్రధాన పార్టీల్లో రెబల్స్ లేకుండా..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల ముఖ్య నేతలు తమ పార్టీ నుంచి రెబెల్ అభ్యర్థులు లేకుండా చూశారు. నామినేషన్లు వేసిన వారిని బుజ్జగించి విత్‌డ్రా చేయించారు. 1వ వార్డులో మూడు పార్టీల నుంచి 3 అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 2వ వార్డులో 4, 3వ వార్డులో 4, 4వ వార్డులో 3, 5వ వార్డులో 4, 6వ వార్డులో 3, 7వ వార్డులో 4, 8వ వార్డులో 4, 9వ వార్డులో 7, 10వ వార్డులో 4, 11వ వార్డులో 4, 12వ వార్డులో 4, 13వ వార్డులో 9, 14వ వార్డులో 4, 15వ వార్డులో 4, 16వ వార్డులో 6, 17వ వార్డులో 3, 18వ వార్డులో 3, 19వ వార్డులో 3, 20 వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ములుగు మున్సిపల్ ఎన్నికల బరిలో 83మంది అభ్యర్థులు
నేటి నుంచి
ముమ్మర ప్రచారం
మున్సిపల్ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించడంతో నేటి నుంచి అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. తమ అనుచరులతో తమకు కేటాయించిన గుర్తులతో వాడవాడ తిరగనున్నారు.
159 నామినేషన్లకు 76 ఉపసంహరణ
పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు
లెక్క తేలింది..!
లెక్క తేలింది..!
లెక్క తేలింది..!


