కలెక్టర్‌ను కలిసిన గెజిటెడ్ ఆఫీసర్లు
ములుగు: మేడారం మహాజాతర విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన కలెక్టర్ టీఎస్.దివాకరను మంగళవారం కలెక్టరేట్‌లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అసోసియేషన్ డైరీని కలెక్టర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు, సెక్రటరీ జీవన్ కుమార్, ట్రెజరర్ ప్రకాశ్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ కొమురయ్య, సంఘం నాయకులు రాజు, శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్, యశ్వంత్, విజయభాస్కర్, శైలజ, దుర్గారావు, శంకర్, రాజేశ్వరరావు, రాజు, బాలయ్య, సారంగపాణి పాల్గొన్నారు.
గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్లలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య పూజలో భాగంగా స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు నాగరాజు తీర్థ ప్రసాదాలు అందించారు.
రేపు ఢిల్లీలో ధర్నా
భూపాలపల్లి అర్బన్: టెట్ రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రేగూరి సుభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలన్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(2)ను ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో
తరలిరావాలి
ఢిల్లీలో జరిగే ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, తిరుపతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొఆన్నరు. టెట్‌ను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
కౌలు రైతు ఆత్మహత్య
ఏటూరునాగారం: అప్పుల బాధతో ఓ కౌలురైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని 3వ వార్డులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బట్టు నర్సయ్య(65) 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఏడేళ్లుగా సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆశించిన రీతిలో దిగుబడి రాక రూ.3లక్షల మేరకు అప్పులయ్యాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులు గమనించి సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యకోసం వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుడు కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
జీవన శైలిలో
మార్పుతోనే క్యాన్సర్
ఎంజీఎం: జీవనశైలిలో మార్పుతోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య తెలిపారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వడ్డేపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. త్వరలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతుందని పేర్కొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన గెజిటెడ్ ఆఫీసర్లు
కలెక్టర్‌ను కలిసిన గెజిటెడ్ ఆఫీసర్లు
కలెక్టర్‌ను కలిసిన గెజిటెడ్ ఆఫీసర్లు


