
విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
ములుగు: విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ప్రణాళికతో చదివి ప్రయోజకులు కావాలని ములుగు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ఆవెర్నెస్ ప్రోగ్రాంను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి కష్టాలు వచ్చినా తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో పంచుకోవాలని సూచించారు. సరైన ఆహారపు అలవాట్లు పాటించి శారీరక వ్యాయామాలు, యోగ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం వినోద్‌కుమార్, లయన్స్ క్లబ్ సెక్రటరీ చుంచు రమేష్, సభ్యులు రాజు, సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా