
విద్యార్థులు శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచుకోవాలి
వెంకటాపురం(ఎం): శాసీ్త్రయ జ్ఞానాన్ని రంగస్థల నైపుణ్యాలతో విద్యార్థులు పెంపొందించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ సూచించారు. మండల పరిధిలోని జవహర్‌నగర్ మోడల్ స్కూల్‌లో సోమవారం జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 10 విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పలు విద్యార్థి బృందాలు నేర్చుకోవాల్సిన అంశాలపై నాటికలు, కథల రూపంలో వివరించారు. ఇందులో పస్రా పరిధిలోని నాగారం సెయింట్ మేరీస్ పాఠశాల విద్యార్థుల బృందం ప్రథమ స్థానం, జాకారం సోషల్ వేల్పేర్ పాఠశాల బృందం ద్వితీయ స్థానం, వెంకటాపురం(ఎం) జెడ్పీఎస్‌ఎస్ పాఠశాల బృందం తృతీయస్థానంలో నిలిచాయని తెలిపారు. ఈనెల 17న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల బృందం పాల్గొనుందని జయదేవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ, డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు సరిత, సుజిత, సమ్మయ్య, శిరుప సతీష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్