
సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి
వాజేడు: పోలీస్ సిబ్బంది విధుల్లో అంకితభావంతో పనిచేయాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సిబ్బంది హాజరు పట్టిక, టర్నవుట్, డిసిప్లిన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పురోగతి, ఆయుధాల భద్రత, స్టేషన్ పరిశుభ్రతపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. విధుల్లో నిబద్ధతతో పాటు క్రమశిక్షణతో ఉండాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం అవసరమన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నేర నియంత్రణ చర్యలు తీసుకోవాలని, గస్తీ అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై సమాచార సేకరణ, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ బలోపేతం, గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయం పెంపొందించుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో వెంకటాపురం సీఐ ముత్యం రమేష్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, వాజేడు ఎస్సై సతీశ్ తదితరులు ఉన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ