
ట్రిపుల్ టీని అనుసరించిన కాకతీయులు
వెంకటాపురం(ఎం): 13వ శతాబ్దంలోనే కాకతీయులు ట్రిపుల్ టీ (టౌన్, టెంపుల్, ట్యాంక్) విధానాన్ని అనుసరించారని ప్రొఫెసర్ పాండురంగారావు వలంటీర్లకు వివరించారు. మండల పరిధి లోని రామప్పలో జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ సోమవారం 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ టీ విధానంపై పలు వివరాలను తెలియజేశారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణ రామప్ప ప్రాంత చరిత్ర, ఈ ప్రాంత ప్రజల జీవన విధానం, సాంస్కృతిక వైవిధ్యం గురించి వివరించారు. ప్రొఫెసర్ సీతారాములు స్ట్రెస్ ఎనాలిసిస్ ఆన్ హెరిటేజ్ స్ట్రక్షర్స్ ఎలా చేయాలో వివరించారు. అనంతరం పాండవుల గుట్ట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటలో తెలుసుకున్న అంశాలను పవర్ పాయింట్ ద్వారా వలంటీర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.
వలంటీర్లతో ప్రొఫెసర్ పాండురంగారావు