
వినియోగదారులకు మెరుగైన విద్యుత్
కన్నాయిగూడెం: వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గంగారంలో 220/11 కేవీ సబ్ స్టేషన్‌ను ఆయన సోమవారం సందర్శించారు. లిఫ్టిరిగేషన్ సబ్ స్టేషన్ నుంచి కన్నాయిగూడెం వరకు 9 కిలో మీటర్లు 33కేవీ ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాపై చర్చించారు. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపంతో ఏర్పడే విద్యుత్ అంతరాయాలు నిరోధించడానికి ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ దోహద పడుతుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతవాసులకు అంతరాయాలు తగ్గుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ మధుసూదన్, తహసీల్దార్ సర్వర్, డీఈ సదానందం, ఏడీఏ స్వామిరెడ్డి, ట్రాన్స్‌కో డీఈ రాజు తదితరులు పాల్గొన్నారు.
చీకుపల్లి సోలార్ గ్రామంగా ఎంపిక
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామాన్ని సోలార్ గ్రామంగా ఎంపిక చేసినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరణ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం చికుపల్లి గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. గృహాలకు సోలార్ విద్యుత్ అందించేందుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్‌తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ మధుసూదన్, భూపాలపల్లి ఎస్సీ మల్చూర్ నాయక్, డివిజనల్ ఇంజనీర్లు నాగేశ్వరావు, సదానందం, ఆపరేషన్ ఏడీఏ స్వామిరెడ్డి, ఏఈ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి

వినియోగదారులకు మెరుగైన విద్యుత్